Magazines

బాల్యవివాహాలను అరికట్టాలి

1 గంట క్రితం

Child marriages
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

- ఐకెపి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వాసుదేవ్...

- బాలికల భవిష్యత్తును కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత - ఆశ్రిత సంస్థ కోఆర్డినేటర్ గణేష్

నవతెలంగాణ - తొగుట

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని ఐకెపి సిద్దిపేట డిపిఎం వాసుదేవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం తొగుట ఐకెపి ఏపీఎం బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి మహిళా సమాఖ్య అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్న జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వాసుదేవ్ మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై మహిళలకు ఆయన అవగాహన కల్పించారు.


బాల్య వివాహాలు బాలికల విద్యకు ఆటంకంగా మారడమే కాకుండా, వారి ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలి

పారు. బాలికలకు నాణ్యమైన విద్య, భద్రత కల్పిస్తూ, వారి ఉజ్వల భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని సూచించారు. గ్రామస్థాయిలో మహిళా సంఘాల సభ్యులు బాల్య వివాహాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ గణేష్ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్, డిసిపిఓ  ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుత సమాజం లో బాల బాలికలు సామాజిక మాధ్యమాలలో చేరి అనవసర విషయాలకు ఆకర్షితులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


బాలికల బాల్యాన్ని కాపాడి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో ఐకెపి అధికారులు, మండల వివో అధ్యక్షురాల్లు, గ్రామస్థాయి వీవో అధ్యక్షురాల్లు, మహిళలు తదితరులు  పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్