Magazines

మృతుడి కుటుంబానికి ప్రమాద బీమా చెక్కు అందజేత

1 గంట క్రితం

insurance check
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్ 

ఇటీవల అకాల మరణం చెందిన బాలాజీ  కుటుంబానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మద్నూరు శాఖ తరపున రూ. 40 లక్షల ప్రమాద బీమా క్లెయిమ్ మొత్తాన్ని శుక్రవారం నాడు అందజేసినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. ఈ మేరకు మద్నూరుకు చెందిన కే. బాలాజీ  రూ. 2,000/- (రెండు వేల రూపాయలు) ప్రీమియం చెల్లించి బ్యాంకు ద్వారా ప్రమాద బీమా (యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్) పాలసీని తీసుకున్నారు.


ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన దురదృష్టవశాత్తు మరణించారు. అనంతరం, కుటుంబ సభ్యులు సమర్పించిన బీమా క్లెయిమ్ కాగితాలను పరిశీలించిన స్టేట్ బ్యాంక్ యంత్రాంగం, క్లెయిమ్‌ను వేగంగా మంజూరు చేసింది. శనివారం మద్నూరు శాఖ ఆవరణలో బాలాజీ  నామినీ, ఆయన భార్య కే. దీపాలికి రూ. 40,000,000/- (నలభై లక్షల రూపాయలు) బీమా పరిహార మొత్తాన్ని బ్యాంక్ ప్రతినిధులు అధికారికంగా అందజేశారు.


ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మద్నూరు శాఖ మేనేజర్ కే. అశోక్ కుమార్  మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తు భద్రత కోసం బ్యాంకు అందించే ప్రమాద బీమా పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. కష్టకాలంలో ఆ కుటుంబానికి ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఆర్థికంగా ఆసరాగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చెక్కు పంపిణీ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్