Magazines

పట్టణంలో పడకేసిన పారిశుధ్ధ్యం

3 గంటల క్రితం

Poor sanitation
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - భీంగల్ 

పట్టణంలో డ్రైనేజీ వ్యవస్త అస్తవ్యస్తంగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక అగ్రికల్చరల్ కార్యాలయం ముందున్న మెయిన్ బజార్‌లో చెత్త పేరుకుపోయిందని, రోడ్లపై మురుగునీరు చేరి, దుర్వాసన వెదజల్లుతోందని వాపోయారు. ఈ శీతాకాలంలో మామూలుగానే ఈగలు, దోమలు ఎక్కువగా ఉంటాయనీ, ఈ పడకేసిన పారిశుద్ధ్యంతో క్రిమికీటకాల వ్యాప్తి మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలోని డ్రైనేజీ సమస్యలు అధికారుల కంట పడటం లేదా.. లేక చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారా అని స్తానికులు నిలదీస్తున్నారు.


ప్రజల నుంచి పన్నులు ముక్కుపిండి వసూలు చేసే భాద్యత సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు చొరవ చూపడం లేదని అడుగుతున్నారు. నిత్యం బజార్‌లో నిత్యావసర సరుకుల కొనుగోళ్ళకు ప్రజల రద్దీ ఎక్కువగా ఉంటుందనీ, వ్యాపారులు, వినియోగదారులు ముక్కు మూసుకుని తిరగాల్సిన దుస్థితి నెలకొందని అంటున్నారు. డ్రైనేజీ సమస్యపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఎవరూ స్పందించడం లేదని కాలనీ వాసులు పేర్కొన్నారు. ఇప్పటికైనా తక్ష‍ణమే అధికారులు స్పందించి..ప్రజలు రోగాల బారిన పడకముందే నిల్వ ఉన్న మురుగు నీటిని తొలగించి, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలనీ, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పట్టణ, కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్