Magazines

మద్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్

1 గంట క్రితం

Open house
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్ 
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మద్నూర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమం జరిగింది.

ఇందులో భాగంగా ఎస్సై మోహన్‌రెడ్డి విద్యార్థులకు చట్టాలపై ఎస్సై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, ప్రాపర్టీ, మిస్సింగ్ కేసులు గురించి వివరించారు. ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి, పిటిషన్లు ఏ విధంగా ఇవ్వాలి, 112 కు ఎప్పుడు కాల్ చేయాలి, రిమాండ్ అంటే ఏమిటి ఎటువంటి నేరస్తులను రిమాండ్‌కు తరలిస్తామనే విషయాలకు గురించి క్ష‍ుణ్ణంగా వెల్లడించారు.


అదేవిధంగా కొత్తగా వచ్చిన బి ఎన్ ఎస్ ఆక్ట్ సెక్షన్లు..గ్రేవ్ కేసెస్, నాన్ గ్రేవ్ కేసెస్ లో గురించి తేడా చెప్పారు. రిసెప్షన్ రూమ్, స్టేషన్ రైటర్ రూమ్,'స్టేషన్ హౌస్ ఆఫీసర్, బెల్లాపామ్ భద్రత గది, డ్యూటీ ఆఫీసర్ రూమ్, లాకప్ గది, 'కోర్ట్ రికార్డ్స్ రూమ్ గురించి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు. కార్యక్రమానికి జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాల విద్యార్థినీలు దాదాపు 300 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో  మద్నూర్ ఎంఈ ఓ, ప్రధాన అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఏఎస్ఐ, పోలీస్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్