Magazines

చిన్నారి వైద్యానికి ఎమ్మెల్యే రూ.4 లక్షల ఎల్‌ఓసీ అందజేత 

1 గంట క్రితం

LoC for child's treatment
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి ఒకరికి సత్తుపల్లి ఎమ్మెల్యే వైద్య ఖర్చుల కోసం రూ. 4 లక్షల ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)ని స్థానిక ద్వారకాపురిలోని అధికారిక క్యాంపు కార్యాలయంలో చిన్నారి కుటుంబ సభ్యులకు శనివారం అందజేశారు. తల్లాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన మేడి తులసి అనే 4 ఏళ్ల చిన్నారి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది.


పాపకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు రూ.4 లక్షల విలువైన ఎల్‌ఓసీ ఎమ్మెల్యే రాగమయి దయానంద్ కృషితో మంజూరైంది.

చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ఆర్థిక సాయం ముందస్తుగా అందేలా చొరవ తీసుకున్నారు. సమయానికి ఎల్‌ఓసీ అందించి ఆదుకున్నందుకు చిన్నారి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. వైద్య ఖర్చుల భారం నుంచి ఊరట కలిగించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు  తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పేదలకు నిరంతరం అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ స్పష్టం చేశారు. 


ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, నాయకులు చల్లగుళ్ల నరసింహారావు మొహమ్మద్ కమల్ పాషా, పింగుల సామేలు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్