Magazines

గోడలకే పరిమితమైన ప్లాస్టిక్‌ నివారణ చర్యలు

09 నవంబర్, 2026

Plastic
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా అవగాహన కల్పించడంతోపాటు "గోడల పైన ప్లాస్టిక్ సంచికన్నా-కాగితం సంచి మిన్న" అని రాయించినా అమలుకు నోచుకోవడం లేదు. పండగ సందర్భంగా ప్రజలు వస్తువులు విక్రయించిన ప్రతి దుకాణంలో వ్యాపారులు ప్లాస్టిక్‌ కవర్లనే వినియోగదారులకు అందజేయడం గమనార్హం. ఎవరూ ప్లాస్టిక్‌ వినియోగాన్ని అడ్డుకునే ప్రయత్నమూ చేయడం లేదు. దీనివల్ల పర్యావరణంపై ఎంత ప్రభావం పడుతుందో ప్రభుత్వం ఇదివరకే అనేకసార్లు హెచ్చరించినా ప్రజలు, అధికారులు పెడచెవిన పెడుతున్నారు. ప్రస్తుతం ఎల్‌నినోతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కున్న పరిస్థితులను మనం చూస్తునే ఉన్నాం.. మళ్ళీ ప్లాస్టిక్‌ వాడకంపై మరో ప్రమాదం ముంచుకు రాకముందే అధికారులు అప్రమత్తమై వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్