నవతెలంగాణ-మల్హర్ రావు
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జిల్లాస్థాయి క్రీడోత్సవాలు అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించారు. మండలంలోని ఎడ్లపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్ 17 బాలుర విభాగంలో కబడ్డీలో సిల్వర్ మెడల్ అండర్ 17 అథ్లెటిక్స్ విభాగంలో కే.సాయి గోల్డ్ మెడల్, అండర్ 14 లాంగ్ జంప్ లో బాలుర విభాగంలో రామ్ చరణ్, సిల్వర్ మెడల్ అథ్లెటిక్స్ 100 మీటర్స్ రన్నింగ్ లో యశస్విని, గోల్డ్ మెడల్ తేజస్విని సిల్వర్ మెడల్, లాంగ్ జంపు బాలికల విభాగంలో యశస్విని, మరో సిల్వర్ మెడల్, షాట్ పుట్ అండర్ 17 బాలుర విభాగంలో గణేష్ సిల్వర్ మెడల్ సాధించారు.
ఈ సందర్భంగా పాఠశాలకు విజయాన్ని అందించిన విద్యార్థినీ, విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ పూర్ణచందర్రావు, ఉపాధ్యాయ బృందం, పేరెంట్స్ కమిటీ అభినందించారు.





కామెంట్‌లు (0)