Magazines

ప్రొ. డా.విజయలక్ష్మికి జాతీయ స్థాయి గుర్తింపు

8 గంటల క్రితం

Prof. Dr. Vijayalakshmi
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

- నాయకపోడు గిరిజన తెగల జీవనశైలి, సంస్కృతిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి. విజయలక్ష్మి విశ్లేషణ

నవతెలంగాణ-సత్తుపల్లి 

​స్థానిక జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) చరిత్ర విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి. విజయలక్ష్మి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన 45వ దక్షిణ భారతదేశ చరిత్ర కాంగ్రెస్ (ఎస్ఐహెచ్‌సీ) సదస్సులో పరిశోధనా పత్రాన్ని సమర్పించి కళాశాలకు విశేష ఖ్యాతి తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఈ ప్రతిష్ఠాత్మక చారిత్రక సదస్సులో ఆమె 'ఎ హిస్టారికల్ స్టడీ ఆఫ్ సొసైటీ అండ్ కల్చరల్ కంటిన్యూటీ ఆఫ్ నాయకపోడు ట్రైబ్స్ ఆఫ్ తెలంగాణ' అనే అంశంపై తన పరిశోధనా పత్రాన్ని ప్రదర్శించారు.


తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాయకపోడు గిరిజన తెగల సామాజిక జీవన విధానం, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక నేపథ్యంతో పాటు  తరతరాలుగా కొనసాగుతున్న వారి వారసత్వ సంపదను ఈ పత్రంలో సమగ్రంగా వివరించారు. గిరిజన సమాజాల ప్రత్యేక జీవనశైలి, వారి సాంస్కృతిక విలువల పరిరక్షణలో ఉన్న ప్రాధాన్యతను చారిత్రక దృక్పథంతో విశ్లేషించారు. మారుతున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకతను ఈ పరిశోధన ద్వారా నొక్కిచెప్పారు. నాయకపోడు తెగల చారిత్రక మూలాలు, సామాజిక నిర్మాణంపై ఆమె చేసిన అధ్యయనం తెలంగాణ గిరిజన చరిత్రలోని ఎన్నో కీలక అంశాలను వెలుగులోకి తెచ్చింది. ​ప్రతిష్ఠాత్మక సదస్సులో కళాశాల తరఫున పరిశోధనా పత్రాన్ని సమర్పించడం పట్ల జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర విభాగం, అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు. అధ్యాపకులు సాధిస్తున్న ఈ విధమైన పరిశోధనా ప్రగతి కళాశాల ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేస్తుందని అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్