Magazines

తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్‌

20 నిమిషాల క్రితం

Tolimudda
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ 

నవతెలంగాణ-నెల్లికుదురు 

మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి అంగన్వాడీ కేంద్రాల్లో తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆ గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం  గౌడు తెలిపారు. బుధవారం అంగన్వాడి కేంద్రంలో కిచిడి పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అంగన్వాడీ కేంద్రంలో దొరికే పౌష్టిక ఆహారం కిచిడి, ఉప్మా పిల్లలకు తినిపిస్తే ఎంతో బలాన్ని ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పెరుమాండ్ల శ్రీజ్యోతి, మాదగాని కవిత, దాసరి కవిత, ఆయమ్మలు రేణుక లచ్చమ్మ వెంకటమ్మ, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్