నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. గురువారం ఖమ్మం సైన్స్ మ్యూజియంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో వీరు 'పంట రక్షణ' అంశంపై తమ ప్రాజెక్టును ప్రదర్శించి న్యాయనిర్ణేతల ప్రశంసలు పొందారు. పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కె. ధనబర్ష టి. ఉషశ్రీ ఈ ప్రాజెక్టును అత్యంత సమర్థవంతంగా వివరించారు. వీరికి పాఠశాల ఉపాధ్యాయురాలు కె. చిట్టి కుమారి గైడ్ టీచర్‌గా వ్యవహరించి దిశానిర్దేశం చేశారు. విద్యార్థినులు సాధించిన ఈ అరుదైన విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు నీరుడు నాగేశ్వరరావు, ఇతర ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులను, గైడ్ టీచర్‌ను అభినందించారు. రాబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా ఇదే స్ఫూర్తితో ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, సత్తుపల్లి ప్రాంతానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.






కామెంట్‌లు (0)