Magazines

చిన్నషక్కర్గాలో అధికారుల ప్రత్యేక సమావేశం

5 రోజుల క్రితం

Special meeting
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్ 

చిన్నషక్కర్గా సర్పంచ్‌ ప్రమాదవశాత్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా సర్పంచ్‌ ఇంటివద్దనే విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో మండలాధికారులు గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో గురువారం జిల్లా పంచాయితీ అధికారి ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులతో ఎంపీడీవో సాయిలు, ఎంపీవో సత్యనారాయణ రెడ్డి, ఎంపీడీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, గ్రామ కార్యదర్శి, ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయితీ నిర్వాహాణ, గ్రామంలో జరగాల్సిన అభివృద్ది పనులపై గురించి చర్చించారు. సమావేశంలోని అంశాలను జిల్లా అధికారులకు నివేదిక పంపుతామని ఎంపీడీవో, ఎంపీవో పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్