నవతెలంగాణ-సత్తుపల్లి
స్పాట్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్తుపల్లిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ఎన్టీఆర్ నగర్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఈ వేడుకలలో ఆ అసోసియేషన్ వ్యవస్థాపకులు, చైర్మన్ బి. వీరన్న ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో అనేక అంశాలపై చర్చించి, వారిలో స్ఫూర్తిని, మనోధైర్యాన్ని నింపారు.
భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులు, బాధ్యతల గురించి ఆయన విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సౌత్ ఇండియా చైర్మన్ నందూ నాయక్, సత్తుపల్లి టౌన్ చైర్మన్ ఎండి. అహ్మద్, సత్తుపల్లి డివిజన్ చైర్మన్ ఇప్పపు అప్పారావు, సత్తుపల్లి మండల చైర్మన్ హలావత్ దేశ్ బాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, ఎంఈఓ నక్కా రాజేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)