Magazines

విద్యార్థులకు పౌస్టికాహారం అందించాలి

6 రోజుల క్రితం

nutritious food
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

మండల పంచాయతీ అధికారి భీమేష్

నవతెలంగాణ-కుభీర్
గ్రామాల్లోని విద్యార్థులకు పౌస్టికాహారం అందించాలని అంగన్వాడీలకు మండల పంచాయతీ అధికారి భీమేష్‌ సూచించారు. గురువారం మండలంలోని పార్డి (బి) అంగన్వాడి కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ మేరకు విద్యార్థులకు అందుతున్న పౌష్టికాహారం హాజరు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..విద్యార్థులకు ప్రభుత్వం అందించే నాణ్యమైన పౌష్టికారం అందించాలనీ, ఎప్పటికప్పుడు పిల్లల బరువును పరిశీలించాలని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని టీచర్లను హెచ్చరించారు.కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త అనుసయా, పంచాయతీ కార్యదర్శి తదితరులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్