Magazines

తొగుటను కరువు మండలంగా ప్రకటించాలి

1 గంట క్రితం

drought zone
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - తొగుట 

తొగుటను కరువు మండలంగా ప్రకటించాలని సర్పంచ్ డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో తొగుట మండలం లేకపోవడంతొ బుధవారం సర్పంచ్ లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మండలంలో ఉన్న మల్లన్న సాగర్, కూడవెల్లి పరివాహ ప్రాంతం వాగులో సాధారణ వర్షపాతంతో ఎక్కడ నీళ్లు లేకుండా పోయాయన్నారు. ప్రభుత్వం మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఉందని మండలంలో కరువు లేదనుకోవడం సరికాదన్నారు. ప్రాజెక్టుతొ మండలంలో పంట భూములకు నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రాజెక్టుతొ 5,6 చెరువు, కుంటలకు మాత్రమే నీరు అందుతుందన్నారు. మండలంలో డిస్ట్ బ్యూటర్ కెనాల్ నిర్మించక పోవడంతో దాదాపు 120 పైగా చెరువు, కుంటాలకు నీరు అందడం లేదని ఆరోపించారు. వర్షాలు కురువక, కరంట్ సరిగా రాక పోవడంతొ పంటలు ఎండిపోయాయని తెలిపారు. వానాకాల పంటలను రైతులు వేసిన సమయంలో ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా నమోదయ్యాయని, దీనికి తోడు ప్రభుత్వం కరెంటు సరిపడా అందించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు.


ఎలినినో ప్రభావంతో పత్తి పంటలు ఎకరాకు మూడు, నాలుగు క్వింటాళ్ళు దిగుబడి రావడం లేదని, రైతాంగం పూర్తిగా అప్పుల ఉబీలో కూరుకుపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సర్వే నిర్వహించి మండలాని కరువు మండలంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  సర్పంచుల ఫోరం అధ్యక్షులు పిట్ల సత్తయ్య, సర్పంచ్ లు చందా లావణ్య స్వామి, పాణ్యల ప్రవీణ్ రెడ్డి, బక్క కనకయ్య, ఎర్వ గోపాల్ రెడ్డి, వెంకటస్వామి గౌడ్, లచ్చోళ్ల రవి, పిట్ల నర్సిములు, రాంపురం రమేష్ తదితరులు పాల్గొన్నారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్