నవతెలంగాణ – నాగోల్: నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు చిన్నారులు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సాయిరాం నగర్ కాలనీ రోడ్ నంబర్ -3కు చెందిన మొగిలి శిరీష ఇద్దరు కుమారులు వరుణ్ తేజ్ (8), మహేష్ (6) అదృశ్యమయ్యారు. చిన్నారుల ఆచూకీ కోసం నాగోల్ పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. చిన్నారులు ఎటు వెళ్లారనే విషయాన్ని గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు.
మరోవైపు చిన్నారుల నివాసానికి సమీపంలో ఉన్న సాయిరాం నగర్ చెరువులో కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారులు చెరువు వద్ద ఆడుకుంటూ నీటిలోకి వెళ్లి ఉండవచ్చనే అనుమానంతో చెరువులో ప్రత్యేకంగా గాలింపు కొనసాగిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే డీఆర్‌ఎఫ్ బృందం సహాయంతో మరింత విస్తృతంగా గాలింపు చేపట్టనున్నట్లు నాగోల్ సీఐ మక్బూల్ జానీ తెలిపారు. చిన్నారుల ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






కామెంట్‌లు (0)