Magazines

తహశీల్దార్‌ కార్యాలయంలో వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

1 గంట క్రితం

Vallabhbhai Patel
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

మండల కేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో ఉక్కుమనిషి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తహశీల్దార్‌ ఎండి ముజీబ్, డిప్యూటీ తహశీల్దార్‌, ఆర్ఐ, అధికారులు కార్యాలయ సిబ్బంది వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తహశీల్దార్‌ మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం పాలన నుండి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్‌ ఎండి ఖలీద్, శివరామకృష్ణ, ఆర్ ఐ మురళీధర్, కార్యాలయ అధికారులు కంప్యూటర్లు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్