Magazines

ఓటు నమోదు కార్యక్రమం 

1 గంట క్రితం

Voter registration
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మర్రిగూడ 

మండల కేంద్రంలో ఆదివారం బిఆర్ఎస్ మండల పట్టభద్రుల కోఆర్డినేటర్ వనమాల మహేష్ ఆధ్వర్యంలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని విఫలమైందన్నారు.


ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి బి ఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.మండలంలో అర్హులైన పట్టభద్రులు అవసరమైన ధ్రువపత్రాలను తీసుకువచ్చి ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగన్,మాజీ ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి, రైతుబంధు సమితి మాజీ మండల కన్వీనర్ బచ్చు రామకృష్ణ, మాజీ ఎంపిటిసి ఊరు పక్క సరిత నగేష్, యరగండ్లపల్లి సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్,మాజీ సర్పంచ్ ఎడ్ల శ్రీరాములు,సీనియర్ నాయకులు,శ్రీను నాయక్,బీరప్ప,వెంకటయ్య,తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్