నవతెలంగాణ-సత్తుపల్లి
విశ్వహిందూ పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి భగవద్గీత శ్లోకాల పోటీల్లో సత్తుపల్లి టాలెంట్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల సీనియర్స్ విభాగంలో చిన్నంశెట్టి లాస్యశ్రీ జిల్లా ప్రథమ స్థానాన్ని, షేక్ ఆస్పియా తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. జూనియర్స్ విభాగంలో జి. వకుల్ సావర్కర్ జిల్లా ప్రథమ స్థానాన్ని సాధించాడు.
విద్యార్థులను నిర్వాహకులు, ప్రముఖ గాయకులు గజల్ శ్రీనివాస్ చేతుల మీదుగా జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన 3వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1,500 చొప్పున నగదు బహుమతులను అందజేసి ప్రోత్సహించారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే భగవద్గీత పట్ల ఆసక్తిని, భారతీయ సంస్కృతి, నైతిక విలువలను పెంపొందించడం అభినందనీయమని విశ్వహిందూ పరిషత్ జిల్లా బాధ్యులు అన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ పులి శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ పులి అరుణ, ఇన్‌చార్జి శంకర్, ఉపాధ్యాయులు అభినందించారు.
విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కరస్పాండెంట్ శ్రీనివాసరావు ఆకాంక్షించారు.






కామెంట్‌లు (0)