Magazines

రేషన్ దుకాణాల్లో నిత్యావసరాల పంపిణీకి కసరత్తు.!

59 నిమిషాల క్రితం

Ration shops
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 2 నిమిషాల చదవడం

మండలంలో మొత్తం 9,934 రేషన్ కార్డులు,27436 మంది సభ్యులు

నవతెలంగాణ-మల్హర్ రావు

పౌరసరఫరాల శాఖ ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యంతోపాటు నిత్యవసర సరుకులను కూడా పంపిణీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇటీవల సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో నిర్వహించిన సమీ క్షలో లబ్ధిదారులకు అందించే సరుకుల పరిమాణాలు, పంపిణీ విధానం,ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం,సరుకుల సేకరణ తదితర అంశాలపై సమగ్ర అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల దిగుబడి తగ్గి నిత్యవసర సరుకుల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఊరట కల్పించే విధంగా రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.


గోధుమపిండి, పామాయిల్, చింతపండు, చక్కెర, కారంపొడి, కందిపప్పు వంటి ఆరు నిత్యావసర సరుకులు పంపిణీ చేయనుంది. పంట దిగుబడి తగ్గి ధరలు పెరిగినా ప్రజా-పంపిణీ వ్యవస్థలో ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించనున్నారు. ఎల్నివో నేపథ్యంలో ఆహార భద్రతకు మరింత భరోసా కల్పించే విధంగా ముందస్తు నిల్వలు ఉంచనున్నారు. 14 నెలలకు సంబంధించి సరిపడా నిల్వ చేసేందుకు సరుకుల సేకరణపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

తక్కువ ధరకే అన్ని సరుకులు..

ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ దుకాణాల ద్వారా నిత్యవసర సరుకులు సబ్సిడీపై తక్కువ ధరకే అందించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. సరుకుల " సేకరణ, రేషన్ కార్డు లబ్దిదారుల సంఖ్య, ప్రభు త్వంపై పడే ఆర్థిక భారం తదితర అంశాలపై సమగ్ర నివేదికను సంబంధిత అధికారులు రూపాం దిస్తున్నారు.నివేదిక అనంతరం సరుకుల పరిమా " ణంతోపాటు ఎంతమేర సబ్సిడీ అందించాలనేది నిర్ణయించనుంది. బహిరంగ మార్కెట్లో లభించే ధర కన్నా తక్కువగా అందిస్తారు.

భగ్గుమంటున్న ధరలు..

నిత్యవసర సరుకులతోపాటు కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. వర్షాలు సక్రమంగా కురవకపోవ డంతో వంటలతోపాటు కూరగాయల దిగుబడులు తగ్గిపోయాయి. ఫలితంగా వాటి ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే బియ్యం , పప్పు దినుసులతోపాటు ఆకుకూరలు, కూరగా యల ధరలు పెరిగి కొనలేని పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని పేదోడిపై ఆర్ధిక భారం పడకూడదనే లక్ష్యంతో రేషన్ దుకాణాల్లో నిత్య వసర సరుకులు పంపిణీ చేయనుంది. మండలంలో మొత్తం 19 రేషన్ దుకాణాలు, 9,934 రేషన్ కార్డులు, 27,436 మంది సభ్యులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. గతంలో ప్రభుత్వాలు నూనె, కందిపప్పు, ఉప్పు, చక్కెర కేజీ చొప్పున, గోధుమలు రెండు కేజీలు, చింతపండు, కారం 250గ్రాములు, పసుపు 200 గ్రాములు ఒక్కో కార్డుకు అందించేవారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్