Magazines

జల మహోత్సవ వేడుకలు

1 గంట క్రితం

Water Festival
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

- హర్ ఘర్ జల్‌లో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం

నవతెలంగాణ - అశ్వారావుపేట

మండలంలోని నారాయణపురం గ్రామపంచాయతీలో మంగళవారం జల జీవన్ మిషన్ ఆధ్వర్యంలో జల మహోత్సవం, హర్ ఘర్ జల్ కార్యక్రమం నిర్వహించారు. నారాయణపురం ఎస్సీ కాలనీలోని వాటర్ ట్యాంక్ వద్ద సర్పంచ్ మడకం కుమారి ఆంధ్రయ్య, ఉప సర్పంచ్ ఆకుల శ్రీను, కార్యదర్శి క్రాంతికుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. మిషన్ భగీరథ ఏఈ సతీష్ గ్రామస్తులకు స్వచ్ఛమైన తాగునీటి ప్రాధాన్యత, నీటి సంరక్షణ, పొదుపు వినియోగంపై అవగాహన కల్పించారు. నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు నీటి వనరులను సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

కార్యక్రమంలో వార్డు సభ్యులు మడకం ఆంధ్రయ్య, యడ్లపల్లి రమేష్, ఎం. అనీష్, గ్రామ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్