Magazines

ముంచుకొస్తున్న మరో తుపాన్‌

22 నిమిషాల క్రితం

storm
avatar
balaji

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

నెల రోజుల్లో మూడోసారి

​బంగాళాఖాతంలో వేగంగా కదులుతున్న మేఘాలు

​తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ ముందస్తు హెచ్చరిక


న్యూఢిల్లీ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడడంతో మరో తుపాన్‌ ‌ముప్పు ముంచుకొస్తోంది. గడిచిన నెల రోజుల వ్యవధిలో అర్నాబ్, మురసు తుపాన్లు రావడం, ఇప్పుడు మూడో తుపాన్‌ రానుండడం ఆందోళన కలిగిస్తోంది.ఈ తుపాన్‌కు అక్వాన్ అని నామకరణం చేశారు. ప్రస్తుతం సముద్రంలో మేఘాలు అత్యంత చురుకుగా కదులుతున్నాయని, దీని ప్రభావంతో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలుగు రాష్ట్రాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. దేశానికి చెందిన ఇన్ సాట్ -3 డీఎస్ , ఇన్ సాట్ -3 డీఆర్ ఉపగ్రహ చిత్రాలు, ఆగ్నేయం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై భారీగా మేఘాలు ఏర్పడటాన్ని నమోదు చేశాయి. ఈ ‘ఆక్వాన్’ తుపాన్ నవంబర్ 19 నాటికి మరింత బలపడి తీవ్ర తుపాన్‌గా మారనుంది.

ఈనెల 20న నెల్లూరు - తుని మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తీరాన్ని తాకే సమయంలో గరిష్టంగా గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, గరిష్టంగా గంటకు 145 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా. తుపాన్ ప్రభావం కారణంగా నవంబర్ 18 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం పూర్తిగా మారనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే తీరప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్