Magazines

ట్రంప్ నకు షాక్‌

36 నిమిషాల క్రితం

Trump
avatar
balaji

ప్రచురించబడింది నవం 17, 2026 | 2 నిమిషాల చదవడం

వారి వీసా కాలపరిమితి కుదింపు కుదరదు
యూఎస్‌ ప్రభుత్వ నిబంధనలను కొట్టివేసిన మాసాచూసెట్స్ డిస్ట్రిక్ట్ కోర్టు

విదేశీ విద్యార్థులు, పరిశోధకులు, పాత్రికేయులకు ఊరట


బోస్టన్ : విదేశీ విద్యార్థులు, పరిశోధకులు, పాత్రికేయుల వీసా కాలపరిమితిని కుదిస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన నిబంధనలను అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు బోస్టన్‌లోని మాసాచూసెట్స్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయ మూర్తి ఎఫ్. డెన్నిస్ సేలర్ సోమవారం కీలక తీర్పును వెలువరించారు. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించిన నూతన వీసా విధానం ఏకపక్షంగా, అధికార దుర్వినియోగంతో కూడి ఉన్నదని, ఈ విధానం చట్టవిరుద్ధమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. విదేశీ విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించాలన్న విధానాన్ని అమెరికా కాంగ్రెస్ ప్రోత్సహిస్తుంటే హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం మాత్రం ఆ అవకాశాలను అడ్డుకునేలా వ్యవహరి స్తోందని ఆక్షేపించారు. పీహెచ్‌డీ వంటి దీర్ఘకాలిక కోర్సులు చేయడానికి, విద్యా విభాగాలను మార్చుకో వడానికి ఈ నిబంధన అడ్డుగా ఉన్నదని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ఇవే విదేశీ విద్యార్థులు, పరిశోధకుల నివాస గడువును నాలుగేండ్లకు ట్రంప్ ప్రభుత్వం పరిమితం చేసింది.


ఆ తర్వాత గడువును పొడిగించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అలాగే చదువు పూర్తయిన తర్వాత దేశం విడిచి వెళ్లడానికి ఇస్తున్న సమయాన్ని 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించాలని కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇక విదేశీ పాత్రికేయుల విషయానికి వస్తే ప్రస్తుతం ఐదేండ్ల వరకూ ఉన్న వీసా గడువును 240 రోజులకు కుదించారు. చైనా పాత్రికేయులకు అయితే ఈ గడువు కేవలం 90 రోజులు మాత్రమే. తాజా తీర్పు కారణంగా అమెరికాలో దశాబ్దాలుగా అమలులో ఉన్న డ్యూరేషన్ స్టేటస్ విధానమే కొనసాగబోతోంది. దీనివల్ల విద్యార్థులు తమ విద్యాభ్యాసం పూర్తయ్యే వరకూ అమెరికాలో ఉండవచ్చు. ప్రభుత్వ నిబంధనను సవాలు చేస్తూ విశ్వవిద్యాలయాలు, ఉపాధ్యాయులు, పాత్రికేయుల సంఘాలు ఆగస్టులో న్యాయస్థానాన్ని ఆశ్రయిం చాయి. నిబంధనలపై సెప్టెంబరులో న్యాయమూర్తి సేలర్ తాత్కాలిక స్టే విధించారు. దీనిపై ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే ఫస్ట్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో పిటిషన్ వేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్