Magazines

అసోంలో 
ఘోర రోడ్డు ప్రమాదం

4 గంటల క్రితం

accident
avatar
balaji

ప్రచురించబడింది నవం 14, 2026 | 2 నిమిషాల చదవడం

ట్రావెలర్, ట్రక్కు ఢీ- 23 మంది మృతి

కజిరంగా: అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 23 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. కోహోరా రేంజ్‌లోని హతికులి టీ ఎస్టేట్ దగ్గర ఉన్న రంగాజన్ వద్ద 715వ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు, కంటైనర్ ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్నాయి. బోకాఖాత్‌ నుంచి నాగావ్‌ వెళ్తున్న మినీ బస్సు పార్క్‌ సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు మినీ బస్సు నుజ్జునుజ్జయ్యింది. దీంతో చాలా మంది ప్రయాణికులు అందులో చిక్కుకుని మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలతో పాటు కళాశాల నుంచి తిరిగి వస్తున్న పలువురు విద్యార్థులు కూడా ఉన్నట్టు అధికారులు ధ్రువీకరించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన

వారిని చికిత్స కోసం కోహోరా మోడల్ ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో చాలామంది కళాశాల విద్యార్థులని, వారు తరగతులు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

మినీ బస్సు జోర్హాట్ నుంచి నాగావ్ వైపు వెళ్తుండగా, కంటైనర్ ట్రక్కు అప్పర్ అస్సాం వైపు వెళ్తోందని పేర్కొన్నారు. అయితే, బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారనేది కచ్చితంగా తెలియకపోయినప్పటికీ, సుమారు 35 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం అందుతోందని చెప్పారు. క్షతగాత్రులను కోహోరా మోడల్ ఆస్పత్రికి తరలించామని, తీవ్రంగా గాయపడిన వారిని బొకాఖాట్, గోలాఘాట్‌లోని ఆస్పత్రులకు, జోర్హాట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించినట్టు వివరించారు. పార్క్ సమీపంలో ఉన్న వేగ నియంత్రణ నిబంధనలను ఉల్లంఘిస్తూ మినీ బస్సు అతివేగంగా వెళ్లడం వల్లే డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ట్రక్కును ఢీకొట్టినట్టు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనాస్థలంలోనే 15 మంది ప్రాణాలు కోల్పోగా, ఆస్పత్రికి తరలించేలోపే మరికొందరు మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టమైన సమాచారం రాలేదు. నిబంధనలను ఉల్లంఘించి పార్క్‌ సమీపంలో బస్సు అతి వేగంతో వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయి ట్రక్కును ఢీకొట్టి ఉంటాడని భావిస్తున్నారు.దుర్ఘటనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్