ఢిల్లీ పోలీసుల లైంగిక వేధింపులు.. భగ్గుమన్న నిరసన ప్రదర్శనలు
ఫిర్యాదు చేసినా స్పందించని యంత్రాం
గం
పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్ ఎదుట ప్రజాసంఘాల ఆందోళ
న
వీడియో ఆధారాలుంటేనే చర్యలా?
ఏసీపీని కాపాడటానికే బీజేపీ యత్నం: బృందా కరత్
చట్టప్రకారం లైంగిక వేధింపులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఆందోళనను కవర్ చేస్తున్న మహిళా జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఆదివారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. శనివారం జరిగిన ఆందోళనను చిత్రీకరిస్తూ, వార్తలు సేకరిస్తున్న సమయంలో ఢిల్లీ పోలీసు అసిస్టెంట్ కమిషనర్ వివేక్ భగత్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళా జర్నలిస్టు ఆరోపించారు. ఆమె ఫిర్యాదు అనంతరం మరో ఇద్దరు మహిళా జర్నలిస్టులు కూడా తమకు ఇలాంటి అనుభవమే ఎదురైందని వెల్లడించారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా జర్నలిస్టులపై పోలీసు అధికారి వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
వీడియో ఆధారాలుంటేనే చర్యలా?
బాధితుల ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, నిందితుడైన పోలీసు అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై చర్చిం చేందుకు బాధితురాలితో పాటు సీపీఐ(ఎం) సీనియర్ నాయకురాలు బృందా కరత్, ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్, సీజేపీ కో కన్వీనర్ సౌరవ్ దాస్, సీజేపీ న్యాయ విభాగం అధిపతి రత్నా సింగ్, జర్నలిస్టు రిషవ్ రంజన్ తదితరులు పోలీసు అధికారులను కలిశారు. మహిళా జర్నలిస్టుల పై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఏసీపీ వివేక్ భగత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమని పోలీసులను నేతలు కోరారు. అయితే, క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు కొనసాగు తోందని, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేమని ఢిల్లీ పోలీ సులు నిరాకరించారు. వీడియో ఆధారాలు ఉంటేనే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పినట్టు నేతలు తెలిపారు. బాధితుల ప్రత్యక్ష ఫిర్యా దులు, వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకో కుండా వీడియో ఆధారాల పేరుతో చర్యలను వాయిదా వేయడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిర్యాదులపై చట్ట ప్రకారం స్పందించాల్సిన పోలీసులే నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని విమర్శించారు.
ఏసీపీని కాపాడటానికే: బృందా కరత్
బృందా కరత్
మాట్లాడుతూ చట్టం స్పష్టంగా ఉందని, ఎలాంటి విచారణ లేకుండానే ఏసీపీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని అన్నారు. అయినా ఢిల్లీ పోలీసులు తమ ఎసిపిని కాపాడటానికి చేయగలిగినదంతా చేస్తున్నారని విమర్శిం చారు.‘‘చట్టం ప్రకారం ఏ మహిళైనా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే, ఆ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం అత్యంత అవసరం. ఆ తరువాతే విచారణ జరుగుతుంది. పార్లమెంటరీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.
ఏసీపీ వివేక్ భగత్ ఒక మహిళా జర్నలిస్ట్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారని (ఆమెను అనుచితంగా తాకాడని), ఆ అమ్మాయి ఏసీపీ వివేక్ భగత్‌ను చూసి 'ఏం చేస్తున్నావు?' అని ప్రశ్నించగా, యూనిఫారంలో ఉన్న ఏసీపీ అక్కడి నుండి పారిపోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి..? కేవలం ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం కోసమే మేము ఇక్కడ కొన్ని గంటలుగా వేచి ఉన్నాము. చట్టప్రకారం లైంగిక వేధింపులపై మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందే. కానీ వారు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరిం చారు. ఈ కేసును పరిశీలిస్తున్న క్రైమ్ బ్రాంచ్ అధికారి ఎవరనేది చెప్పడానికి కూడా నిరాకరి స్తున్నారు. దీని అర్థం ఏమిటంటే మహిళల భద్రత కోసం చట్టాలను కఠినంగా, సున్నితంగా మార్చేం దుకు దశాబ్దాలుగా మనం చేసిన పోరాటాలను అమిత్ షా పరిధిలోని ఢిల్లీ పోలీసులు నాశనం చేస్తున్నారు. దీనిని మేం ఏమాత్రం సహించం, ’’ అని అన్నారు.
వెల్లువెత్తిన నిరసనలు
ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందిత పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్‌స్టేషన్ వరకు మార్చ్ నిర్వహించారు. సీజేపీ కన్వీనర్ అభిజీత్ దీప్కే, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ క్రాప్స్, ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్, కేరళం యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ తదితర సంఘాలు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. మహిళా జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడం, బాధితులు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం ఢిల్లీ పోలీసుల పనితీరుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. మహిళల భద్రత, పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య నిరసనల హక్కుల పరిరక్షణపై ప్రభుత్వాల నిబద్ధతను ఈ ఘటన మరోసారి ప్రశ్నార్థకం చేస్తోంది.





కామెంట్‌లు (0)