నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ముంబైలోని శివాజీ పార్క్ వద్ద చేపట్టిన సీజేపీ నిరసన కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. నిరసనకు మద్దతుగా అక్కడికి వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. మృతుడిని థానేలోని దోస్తి వెస్ట్ కౌంటీకి చెందిన గోపాలకృష్ణ సుబ్బయ్య పిళ్లైగా గుర్తించారు. నిరసన కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఆయన శుక్రవారం సాయంత్రం శివాజీ పార్క్‌కు వెళ్లారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఆయనకు అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే పోలీసులు ఆయనను శుశ్రూష ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గోపాలకృష్ణ మృతి చెందినట్లు సమాచారం.
సీజేపీ నిరసనలో గుండెపోటుతో వ్యక్తి మృతి
19 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)