Magazines

పోలీసుల బలప్రయోగానికి హద్దేది?

1 గంట క్రితం

బలప్రయోగం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 3 నిమిషాల చదవడం

ప్రజాస్వామ్యంలో నిరసన గొంతు నొక్కుతున్న బీజేపీ పాలకులు
మార్గదర్శకాలు గాలికొదిలేస్తున్న వైనం
అయినా పోలీసు లాఠీలకు 
అడ్డుకట్ట లేని వైనం
కనీస బలప్రయోగమేనని 
చెప్తున్న నిబంధనలు
అమలులో మాత్రం ఖాకీల 
‘అతి ప్రవర్తన'
ఆందోళనకారులను 
బెదిరించే చర్యలు విశ్లేషకులు
దేశంలో ప్రజలు ప్రశాంతంగా నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు. ఆ నిరసనను అదుపు చేయడం పేరుతో పోలీసులు ఎంతవరకు బలప్రయోగం చేయవచ్చు? ఈ ప్రశ్న మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద జులై 20న జరిగిన నిరసనలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన విచారణ కమిటీ పరిశీలన జరుపుతోంది. అయితే అసలు సమస్య ఈ ఒక్క ఘటనకే పరిమితం కాదు. పోలీసుల వద్ద ఎన్నో నియమాలు, మార్గదర్శకాలు ఉన్నప్పటికీ.. నిరసనకారులపై అతి బలప్రయోగం ఎందుకు జరుగుతోందన్నదే పెద్ద ప్రశ్న.

న్యూఢిల్లీ : జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనకారులపై పోలీసులు లాఠీలు, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని నివేదికల ప్రకారం మేకులు అమర్చిన లాఠీలు, రబ్బర్‌ బుల్లెట్లు, విద్యుత్‌ బాటన్లు, పెల్లెట్‌ గన్స్‌ కూడా ఉపయోగించినట్టు ఆరోపణలు వచ్చాయి. అక్కడ నిరసన చేస్తున్న వారిలో కొందరిని పోలీసులు కొట్టిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో ‘ప్రజా శాంతి’ పేరుతో పోలీసులు ఉపయోగించే బలానికి హద్దు ఏమిటన్న ప్రశ్న ముందుకొచ్చింది.
రాజ్యాంగానికి విరుద్ధంగా పరిస్థితులు
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(బి) పౌరులకు ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును కల్పిస్తోంది. అయితే ప్రజా శాంతి, దేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడే పేరుతో ఆ హక్కుపై పరిమితులు విధించేందుకు ఆర్టికల్‌ 19(3) అవకాశం ఇస్తోంది. అంటే దీనర్థం నిరసనను పూర్తిగా అణచివేయడం కాదు.. అవసరమైనప్పుడు, చట్టబద్ధమైన పరిమితుల్లో నియంత్రించడం మాత్రమే పోలీసుల బాధ్యత. కానీ వాస్తవ రూపంలో మాత్రం పోలీసుల తీరు అందుకు భిన్నంగా ఉంటోంది. రాజ్యాంగం కల్పించిన నియంత్రణ పేరుతో పరిమితికి మించి బలప్రయోగం చేస్తున్నారు. దీంతో ఆందోళనకారులను బెదిరిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వాల నుంచి వస్తున్న ఆదేశాలే కారణమంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. సహాయం అందించాలి. కానీ ఇవేమీ అంతగా పాటిస్తున్న దాఖలాలు లేవనే విమర్శలు పోలీసులపై వస్తున్నాయి.
మార్గదర్శకాలు ఏం చెప్తున్నాయి?
కేంద్ర హోంశాఖ 1985లో రూపొందించిన పోలీసు ప్రవర్తనా మార్గదర్శకాలు తొలుత ప్రజలను ఒప్పించడం, సూచనలు ఇవ్వడం, హెచ్చరించడం వంటి శాంతియుత మార్గాలను ఉపయోగించాలని చెప్తున్నాయి. అవి పనిచేయని పరిస్థితుల్లోనే బలప్రయోగం తప్పనిసరి అయినప్పటికీ.. దానిని కూడా అతి స్వల్పంగా మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేస్తున్నాయి. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కూడా పోలీసులకు సూచిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. పోలీసు బలప్రయోగాన్ని సాధ్యమైనంత వరకు నివారించాలనీ, తప్పనిసరి అయితే అవసరమైన కనీస స్థాయికే పరిమితం చేయాలని సూచిస్తున్నాయి. చర్య తీవ్రతకు అనుగుణంగానే బలం ఉండాలి. గాయాలు, నష్టం తగ్గించాలి. గాయపడిన వారికి వైద్య
ఇది జంతర్‌ మంతర్‌ సమస్య మాత్రమే కాదు..
అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ లా స్కూల్‌ రూపొందించిన నమూనా కూడా ఇదే విధానాన్ని సూచిస్తోంది. అనుమతి లేదన్న ఒక్క కారణంతో, గతంలో ఆ బృందంపై ఆరోపణలు ఉన్నాయన్న కారణంతోనే నిరసనను ‘ప్రమాదకరమైనది’గా నిర్ణయించకూడదని అది చెప్తోంది. భారత్‌లో మాత్రం నిబంధనలు ఉన్నప్పటికీ పోలీసు బలప్రయోగంపై జవాబు దారీతనం పేలవంగా ఉందన్న విమర్శలు కొనసాగు తున్నాయి. ఇది కేవలం జంతర్‌ మంతర్‌ ఘటన సమస్య మాత్రమే కాదు. గతంలో నోయిడాలో వేతనాల పెంపు కోసం నిరసన చేసిన కార్మికులు, ముంబయిలో ఆరే కాలనీలో చెట్ల నరికివేతను వ్యతిరేకించిన కార్యకర్తలు, తమిళనాడులో జల్లికట్టు నిషేధానికి వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రజలు.. ఇలా అనేక సందర్భాల్లో పోలీసుల అధిక బలప్రయోగంపై విమర్శలు వచ్చాయి.
బలప్రయోగం చేసే అవకాశం ఉండాలి.. : 
ఓ సర్వేలో పోలీసుల అభిప్రాయం
అంటే ప్రజాస్వామ్యంలో నిరసన హక్కును కాపాడాల్సిన వ్యవస్థే.. నిరసనను అణచివేసే శక్తిగా మారుతోందా? కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు సంస్కరణలపై ఎన్నో హామీలు ఇచ్చినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎందుకు మారడం లేదు? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. 2025లో 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 8,276 మందికి పైగా పోలీసులపై నిర్వహించిన సర్వే కూడా ఆందోళనకరమైన విషయాన్ని బయటపెట్టింది. 70 శాతానికి పైగా పోలీసులు శిక్ష అనేటువంటి భయం లేకుండా బలప్రయోగం చేసే అవకాశం ఉండాలని అభిప్రాయపడ్డారు. దాదాపు 69 శాతం మంది కోర్టు విచారణ లేకుండానే అనుమానితులను అరెస్టు చేసి నిర్బంధించే అధికారం పోలీసులకు ఉండాలని చెప్పడగం గమనార్హం.
నిబంధనలున్నా.. ఢిల్లీ పోలీసుల సొంత నిబంధనలు కూడా నిరసనల సమయంలో ‘అత్యంత సంయమనం’ పాటించాలని చెప్తున్నాయి. బలప్రయోగం వల్ల గాయాలు సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చూడాలని మరో ఆదేశం స్పష్టం చేస్తోంది. అయితే ఇక్కడ వినబడుతున్న ప్రశ్న ఒక్కటే.. ఇన్ని నిబంధనలు ఉన్నా పోలీసు చర్యల్లో నిరసనకారులకు గాయాలు ఎందుకు సాధారణమవుతున్నాయి?. దీనికి ప్రధాన కారణం నిబంధనలు లేకపోవడం కాదు.. వాటిని అమలు చేసే విధానంలో ఉన్న లోపాలే. నిరసనకారుల సంఖ్య ఎంత? పోలీసులు ఎంతమంది ఉన్నారు? నిజమైన ముప్పు మొత్తం గుంపు నుంచా? లేక కొంతమంది వ్యక్తుల నుంచా? బయటకు వెళ్లేందుకు మార్గం ఉందా? పరిస్థితిని చర్చల ద్వారా చక్కదిద్దే అవకాశం ఇంకా ఉందా? వంటి అంశాలను ముందుగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రభుత్వాలు దృష్టి సారించాలి

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ ప్రజలను రక్షించాల్సిందే తప్ప.. ప్రజలపై భయాన్ని ప్రయోగించే వ్యవస్థగా మారకూడదని మేధావులు సూచిస్తున్నారు. నిరసనను అణచివేయడం సులభమే కానీ ప్రజల గొంతును గౌరవిస్తూ శాంతిభద్రతలను కాపాడటం నిజమైన ప్రజాస్వామ్య పరీక్ష అని చెప్తున్నారు. నిబంధనలు పుస్తకాలలోని పేజీలపై రాతల్లా కాకుండా.. వాటిని పోలీసు వ్యవస్థ ఎంతవరకు పాటిస్తుందన్నదే అసలు ప్రశ్న అని అంటున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి పోలీసుల అతి చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిందిగా వారు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్