నవతెలంగాణ అమరావతి: ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.మొత్తం 659జడ్పీటీసీ స్థానాల్లో 170కిపైగా స్థానాల్లో..మొత్తం 9,821ఎంపీటీసీ స్థానాల్లో రెండు వేలకుపైగా చోట్ల కూటమి హవా కొనసాగుతోంది.ఈ ఎదురుగాలిని సైతం తట్టుకొని కొన్ని జిల్లాలలో సీపీఐ(ఎం)ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించింది.ఏలూరుజిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం 2ఎంపీటీసీ స్థానంలో సీపీఐ(ఎం)అభ్యర్థి కనకమ్మ 78ఓట్ల తేడాతో ఇండిపెండెంట్ అభ్యర్థిపై గెలుపొందారు.
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని కోడుమూరు -5ఎంపిటిసిగా సీపీఐ(ఎం)అభ్యర్థి నాగిరెడ్డి విజయం సాధించారు.ఎటపాక మండలం విస్సాపురం ఎంపీటీసీస్థానంలో సీపీఐ(ఎం)అభ్యర్థి సోందే రామారావు 289ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.
పోలవరం జిల్లా విఆర్ పురం మండలం రామవరం ఎంపీటీసీ సీపీఐ(ఎం)అభ్యర్థి కారం సుందరయ్య గెలుపొందారు.నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అన్నారెడ్డి పాలెం ఎంపీటీసీ సీపీఐ(ఎం)అభ్యర్థి కోసూరి వెంకటరమణమ్మ 120ఓట్ల మెజార్టీతో విజేతగా నిలిచారు. ఏలూరు జిల్లా వెలేరుపాడు మండలం నాల్లవరం సీపీఐ(ఎం) ఎంపీటీసీ ఊకే సరోజిని గెలుపు. పోలవరం జిల్లా కూనవరం మండలం పెదార్కూరు ఎంపీటీసీగా సీపీఐ(ఎం) అభ్యర్థి బీజేపీ అభ్యర్థిపై 754 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కూనవరం మండలం రేగులపాడు ఎంపీటీసీగా సీపీఐ(ఎం) అభ్యర్థి గుండం బుచ్చమ్మ గెలుపొందారు. వీఆర్ పురం మండలం చిన్నమట్టపల్లి ఎంపీటీసీగా సీపీఐ(ఎం) అభ్యర్థి సున్నం రాజు 1352 భారీ ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అల్లూరి జిల్లా ముంచింగి పుట్టు మండలం లక్ష్మీపురం ఎంపీటీసీ సిపిఎం అభ్యర్థి కోర్ర మల్లేశ్వర రావు 361ఓట్లు తో విజయం.
జడ్పీటీసీలలోనూ సీపీఐ(ఎం)
జడ్పీటీసీలలోనూ సీపీఐ(ఎం)అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు.అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగి పుట్టు మండల జడ్పీటీసీగా సీపీఐ(ఎం)అభ్యర్థి కోర్రా త్రినాథ్,క్రోసూరు జడ్పీటీసీగా సీపీఐ(ఎం)అభ్యర్థి జి.రవిబాబు గెలుపు దిశగా ఉన్నారు.







కామెంట్‌లు (0)