దుఃఖ విషాన్ని
ఒక్కక్క బొట్టుబొట్టుగా
ఊహ తెలిసిన నాటి నుంచి తాగుతున్నా
ఆశ్చర్యంగా -
చావలేదు ఇంకా...
అవమానాల లోయలో
నిర్ధాక్షిణ్యంగా తోసేసినా
ఆత్మగౌరవం మెట్లెక్కి
పైకి ఆకాశంలో విజయపతాకలా
కామలిప్త ముళ్ళు గుచ్చిన మాటల లాఠీలతో
మనసును కుళ్ళబొడిచి కుళ్ళబొడిచి చంపినా
దేవ పారిజాతాన్నై పరిమళిస్తూనేవున్నా!
ఎడమవైపు నడిచినా
ఎటువైపు నుంచో
వాహనం వచ్చి గుద్దినట్లు
చవితి చంద్రుడిని చూడకపోయినా
నీలాపనిందల బహుమానాలే!
కరెన్సీ వాసన, కామం వాసన
నిండిన ప్రపంచంలో
బ్రతుకొక నిత్యనూతన యమగండమైనా
బండరాళ్ళ మధ్య తొంగి చూస్తున్న
ఎర్రని రావిచిగురులా
ఆశల నక్షత్రం వెలుగులో
మునుముందుకే...
- మందరపు హైమవతి, 9441062732
దుఃఖ విషం
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)