భారత్ కు మూడు స్వర్ణ పతకాలు అందించిన నారాయణ స్కూల్స్ విద్యార్థులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వియత్నాంలోని హనోయ్ నగరంలో ఘనంగా నిర్వహించిన 19వ అంతర్జాతీయ ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్ ఒలింపియాడ్ (ఐఓఏఏ - 2026) పోటీల్లో భారత జట్టు తరపున ప్రాతినిధ్యం వహించిన నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. దేశానికి మూడు బంగారు పతకాలను అందించారు. ఈ అంతర్జాతీయ పోటీలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఐదుగురు సభ్యుల బృందంలో ముగ్గురు నారాయణ పాఠశాలల విద్యార్థులే కావడం విశేషం. వీరిలో అక్షిత్ శ్రీవాస్తవ (గురుగ్రామ్), ప్రాంజల్ రెడ్డి (హైదరాబాద్), సుమంత్ గుప్తా (ముంబై) తమ అసాధారణ ప్రతిభతో ముగ్గురూ స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 64 దేశాలు పాల్గొన్న ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో నారాయణ విద్యార్థుల విశేష కృషితో భారత సంయుక్తంగా మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నది. అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని చాటిచెప్పారు.
ఈ సందర్భంగా నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ పి.సింధూర నారాయణ మాట్లాడుతూ ఐదుగురితో కూడిన భారత జట్టులో పాల్గొన్న ముగ్గురు నారాయణ విద్యార్థులు స్వర్ణ పతకాలు సాధించడం నారాయణ సంస్థకే కాకుండా యావత్ భారతదేశానికి గర్వకారణమన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నిరంతర సాధన, అభ్యాసం పట్ల మక్కువను పెంపొందించడం ద్వారానే ఇలాంటి విజయాలు సాధ్యమవుతున్నాయన్నారు. గత 47 ఏళ్లుగా అనుభవం, నైపుణ్యం, ఆత్మీయత అనే పునాదులపై నిర్మితమైన నారాయణ ప్రత్యేక ఒలింపియాడ్ శిక్షణ విధానం విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ స్థానాల్లో నిలబెడుతోందని తెలిపారు. విద్యార్థుల ప్రతిభకు సరైన మార్గదర్శకత్వం తోడైతే ఎలాంటి విజయాలనైనా సాధించవచ్చని అక్షిత్, ప్రాంజల్, సుమంత్ లు నిరూపించారని అభినందించారు. పాఠశాల స్థాయి విద్యార్థుల్లో సైన్స్, ఆస్ట్రానమీ, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించే ప్రధాన స్థాయి వేదికపై నారాయణ విద్యాసంస్థలు సాధించిన విజయం పట్ల నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం, అధ్యాపక బృందం, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. గతంలోనూ జాతీయ, అంతర్జాతీయ ఒలింపియాడ్ లతో పాటు జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల్లో నారాయణ విద్యార్థులు అగ్రస్థానాల్లో నిలిచి తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
అంతర్జాతీయ ఆస్ట్రానమీ ఒలింపియాడ్ 2026లో నారాయణ విద్యార్థుల ప్రభంజనం
59 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 06, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)