Magazines

ఎర్రవల్లిలో 45 ఎకరాల భూమి మాయం

2 గంటల క్రితం

Erravalli
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

సర్వేకు సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదేశం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 325లో 45 ఎకరాల భూమి మాయమైన ఘటనపై వెంటనే సమగ్ర సర్వే నిర్వహించాలంటూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌‌రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల భూముల అంశంపై మంగళవారం సీఎం సమీక్ష నిర్వహించారు. గతంలో ఈ రెండు గ్రామాల్లో నిర్వహించిన సర్వే వివరాలను రెవెన్యూ అధికారులు సీఎం తెలిపారు. సర్వే నంబర్ 325లో మొత్తం 388 ఎకరాల భూమికి గాను 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్టు తేలిందని వివరించారు. సీఎం ఆదేశాలతో రెవెన్యూ అధికారులు భూమి గుర్తింపు కోసం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో సర్వే నోటిఫికేషన్ విడుదల చేశారు. భూమి సరిహద్దులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు రెవెన్యూ రికార్డులు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సర్వే నంబర్ 325లో ఉన్న భూమిని అర్హులైన స్థానిక రైతులకు, తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు కేటాయించి, కాలనీ ఏర్పాటు చేయాలన్నారు. నిర్మాణ బాధ్యతలను హౌసింగ్ డిపార్ట్‌‌మెంట్‌‌కు అప్పగించి జూన్ 2లోగా నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్