Magazines

కాగితాలకే బడ్జెట్‌ ‌కేటాయింపులు

48 నిమిషాల క్రితం

Budget allocations remain only on paper.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 2 నిమిషాల చదవడం

కొత్తగూడెంపై కన్నేస్తే సహించం :మీట్‌‌ది ప్రెస్‌‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో ఏదో ఒకటి చేయాలని కష్టపడుతున్నప్పటికీ, ప్రభుత్వంలో మంత్రుల మధ్య ఏమాత్రం సమన్వయం లేకపోవడం పరిపాలనా వైఫల్యానికి దారితీస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఖమ్మంలో శనివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌‌లో ఆయన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతి పక్ష బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ పాలనపై తీవ్రస్థాయి లో విమర్శలు గుప్పించారు. మంత్రులకు తమ శాఖలపై పూర్తిస్థాయి స్వేచ్ఛ, అధికారాలు లేకపోవడంతో కీలక నిర్ణయాలు, ఫైళ్లన్నీ ఆర్థిక శాఖ వద్దే పెండింగ్‌లో ఉండిపోతున్నాయని చెప్పారు. బడ్జెట్ కేటాయింపులు కాగితాలకే పరిమితమై, నిధులను సకాలంలో విడుదల చేసి ఖర్చు పెట్టే ఆర్థిక సమర్థత ప్రభుత్వం వద్ద కొరవడిందని అన్నారు. విద్యా రంగానికి ప్రాధాన్యత హైదరాబాద్‌కే పరిమితమైందని తెలిపారు. పదేండ్ల బీఆర్ఎస్ దుర్మార్గాన్ని, దురాగతాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని స్పష్టం చేశారు. ​కొత్తగూడెం నియోజక వర్గంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టి సారించడంపై కూనంనేని ఘాటుగా స్పందించారు. కొత్తగూడెం కమ్యూనిస్ట్ ఉద్యమాల ఖిల్లా అని, ప్రజామోదంతో గెలిచిన తమ స్థానంపై ఎవరు కన్ను వేసినా సహించేది లేదని హెచ్చరించారు. 'స్నేహం స్నేహమే.. పోరాటం పోరాటమే' అనే సూత్రానికే కట్టుబడి ఉంటామని, రాబోయే ఎమ్మెల్సీ, ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల్లో సీపీఐ స్వతంత్రంగానే వ్యవహరి స్తుందని చెప్పారు.సింగరేణి సంస్థను ప్రయివేటీకరణ వైపు నెట్టే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీక రించ బోమన్నారు. ​కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ బద్ధమైన ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియరీ, పార్లమెంట్ వంటి వ్యవస్థల స్వతంత్రతను ధ్వంసం చేస్తోందని, డూప్లికేషన్ పేరుతో లక్షలాది మంది ఓటర్ల పేర్లను తొలగించడం ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాత మని కూనంనేని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు రూ.20 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తున్న కేంద్రం పేదలకు ఎలాంటి ఉపశమనమూ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్