వామపక్ష, కాంగ్రెస్,
టీజేఎస్, ఎస్పీ, ఆర్జేడీల పిలుపు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్
రాజీనామా చేయాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సర్ ప్రక్రియలో అక్రమాలను అరికట్టాలనీ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష, కాంగ్రెస్, టీజేఎస్, ఎస్సీ, ఆర్జేడీల ఆధ్వర్యంలో గురువారం చలో లోక్భవన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నెక్లెస్రోడ్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి లోక్భవన్ (గవర్నర్ కార్యాలయం) వరకు ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు బి మహేష్ కుమార్ గౌడ్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ,
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోదండరామ్తోపాటు ఇతర వామపక్ష పార్టీల నాయకులు, పలువురు మంత్రులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొంటారు. సర్ ప్రకియ పేరుతో దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను తొలగించడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. అర్హులైన ఓట్లను తొలగించొద్దనీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గురువారం నిర్వహించే చలో లోక్భవన్ కార్యక్రమానికి పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయా పార్టీలు విజ్ఞప్తి చేశాయి.






కామెంట్లు (0)