Magazines

రసాయన శాస్ర్తంలో ఇద్దరికి నోబెల్

2 గంటల క్రితం

Chemistry
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

హెన్రీ కాగన్, కెన్సో సోయికి దక్కిన పురస్కారం '
నాన్-లీనియర్ ప్రభావాలు', 'ఆటోకటాలిసిస్' అంశాల్లో విప్లవాత్మక ఆవిష్కరణలు


స్టాక్ హోమ్ : రసాయన శాస్త్రంలో ఈ ఏడాది ఇద్దరు శాస్త్రవేత్తలను నోబెల్ బహుమతి వరించింది. ‘నాన్-లీనియర్ ప్రభావాలు’, ‘ఆటోకటాలిసిస్’ అంశాల్లో విప్లవాత్మక ఆవిష్కరణలకు గానూ హెన్రీ బి. కాగన్, కెన్సో సోయి ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో బుధవారం రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ మేరకు విజేతల పేర్లను ప్రకటించింది. హెన్రీ బి. కాగన్ ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత ‘యూనివర్శిటీ పారిస్- సుద్’ లో పలు పరిశోధనలు చేశారు. కెన్సో సోయి జపాన్‌లోని ‘టోక్యో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్’ లో సేవలందిస్తున్నారు. 95 ఏండ్ల వయస్సులో కెన్సో ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఆధునిక రసాయన శాస్త్రంలో ముఖ్యంగా ఔషధ తయారీ రంగంలో వీరు కీలక పరిశోధనలు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్