నవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్
ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో వేల ఎకరాలలో వరి, పత్తి తదితర వాణిజ్య పంటలను రైతులు వేశారని, వేసిన పంటలకు నీరందక ఎండిపోతున్నాయని, కరువు పరిస్థితులపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి కోరారు. ఆదివారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో ఎండిపోతున్న వరి పంటలను ఆయన పరిశీలించారు. ఎండిన పంటలను రైతులు పశువులను మేపడాన్ని చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావ ప్రభావం వల్ల రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని వాటిని పరిష్కరిం చేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తీసు కోవాలన్నారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితు లను కేంద్రానికి తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రతినిధులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు పూనుకోవాలన్నారు. రైతులు ఎకరాకు రూ.20వేల నుండి రూ.30 వేల వరకు వెచ్చించి పంటలను సాగు చేశారన్నారు. అందుకు ప్రయివేట్ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చి అదనపు వడ్డీ చెల్లించి సాగు చేయడానికి ప్రయత్నించారన్నారు. ఎండిపోయిన పొలాలను అధికారులు పరిశీలించి పంటనష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు. దామరచర్ల, మరికొన్ని ప్రాంతాలలో ఎక్కువ దళిత, గిరిజన రైతులే పంటలు వేశారని, వారికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. అందుకు ప్రత్యామ్నాయంగా నాగార్జునసాగర్ ఎడమకాల ద్వారా సాగునీటిని విడుదల చేయాలని, తద్వారా కొంత మేరకు రైతులకు ఉపశమనం కలుగుతుందని సూచించారు. ఆయకట్టు ప్రాంతంలో ఉన్న చెరువులు కూడా సాగర్ నీటితో నింపితే అటు తాగునీటితో పాటు సాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుందన్నారు. భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేశ్, రైతుసంఘం జిల్లా కార్యదర్శి వీరేపల్లి వెంకట్‌శ్వర్లు, సీపీఐ(ఎం) నాయకులు వినోద్ నాయక్, దయానంద్, వీరకోటిరెడ్డి, ఎర్రనాయక్ ,రైతులు పాల్గొన్నారు.
ఖరీఫ్ లో వేసిన పంటలను కాపాడాలి
2 గంటల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)