Magazines

16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్లు

1 గంట క్రితం

Indiramma Houses
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 2 నిమిషాల చదవడం

పోస్ట్ వెరిఫికేషన్ అనంతరం అర్హుల ఎంపిక
లబ్ధిదారులకు రూ.1,00,000 చెల్లింపు గడువు
ఈ నెల 9 వరకు తుది పొడిగింపు
గడువులోగా చెల్లింపు చేయని పక్షంలో ప్రొవిజనల్ కేటాయింపు రద్దు :తెలంగాణ హౌసింగ్ బోర్డు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
క్యూర్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన లబ్దిదారులు రూ.ఒక లక్ష చెల్లించే గడువును అక్టోబర్ 9 వరకు పొడిగించారు. అప్పటిలోగా చెల్లించని వారి కేటయింపులను రద్దు చేస్తామని తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నెల 4 వరకు 5,501 మంది లబ్దిదారులకు 5,501 ప్రొవిజనల్ అలాట్ మెంట్ లెటర్లు జారీ చేయగా అందులో 3,271 మంది (59.46 శాతం) రూ.ఒక లక్ష చొప్పున చెల్లించారు. కొన్ని ప్రాంతాల్లో 60 శాతం, మరికొన్ని ప్రాంతాల్లో 70 శాతం కంటే ఎక్కువ మంది చెల్లింపులు చేశారు. కూకట్ పల్లి (81.05 శాతం), శేరిలింగంపల్లి(74.94), కుత్బుల్లాపూర్ (73.87), నాంపల్లి (73.83), కార్వాన్ (68.85), అంబర్‌పేట్(65.22), మేడ్చల్ (64.84), బహదూర్‌పురా(62.53), ఇబ్రహీంపట్నం(50.89), మల్కాజిగిరికౌకూర్(50.86), సికింద్రాబాద్ కంటోన్మెంట్ (48.05), రాజేంద్రనగర్ (43.72), సనత్‌నగర్(43.59), మహేశ్వరం(42.44), మలక్‌పేట్ (32.67), ఖైరతాబాద్(17.16 శాతం) చెల్లించారు. ఇప్పటివరకు చెల్లించని ఎంపికైన లబ్ధిదారులందరూ, తెలంగాణ హౌసింగ్ బోర్డు తెలియజేసిన అధికారిక ఖాతా లేదా నిర్దేశిత చెల్లింపు విధానం ద్వారా 09.10.2026 లోగా తప్పనిసరిగా చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత అదనపు గడువు పొడిగింపు ఉండదని హౌసిం గ్ బోర్డు స్పష్టం చేసింది. తదుపరి నోటీసు ఇవ్వకుండా రద్దు ప్రొవిజినల్ కేటాయింపును రద్దు చేస్తారు. అటువంటి రద్దుల కారణంగా ఖాళీ అయ్యే ఫ్లాట్లను, అమలులో ఉన్న నిబంధనలు, అనుమతులు, నిర్దేశిత విధానానికి లోబడి, సంబంధిత అర్హత జాబితా లేదా వెయిటింగ్ లిస్టులోని ఇతర అర్హులైన దరఖాస్తుదారులకు కేటాయించేందుకు పరిశీలిస్తారు. ప్రస్తుతం కేటాయింపులు పొందని మిగిలిన సుమారు 35 వేల మంది అర్హులైన దరఖాస్తుదారులను కూడా రాబోయే నెలల్లో నిర్వహించనున్న తదుపరి డ్రా ఆఫ్ లాట్స్‌లో, అందుబాటులో ఉండే ఫ్లాట్లు, అమలులో ఉన్న నిబంధనలకు లోబడి, కేటాయింపునకు పరిగణనలోకి తీసుకోబడతారు. పథకం, కేటాయింపు మరియు చెల్లింపులకు సంబంధించిన తాజా సమాచారం కోసం లబ్ధిదారులు తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ TGHB.Telangana.gov.in ను సందర్శించవచ్చు. లేదా హౌసింగ్ బోర్డు కాల్ సెంటర్ నెంబర్ 040-24603572ను సంప్రదించవచ్చు. కేటాయింపుదారులకు వారి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లకు ‘TGHBO-S’ పేరుతో ఎస్ఎంఎస్/వాట్సప్ ద్వారా కూడా సమాచారం పంపబడుతుంది. లబ్దిదారులందరూ ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మెన్, హౌసింగ్ కమిషనర్ వి.పి.గౌతమ్ కోరారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్