Magazines

సంతోష్‌నగర్‌లో 
సంప్రదాయ కుస్తీ పోటీలు

1 గంట క్రితం

Traditional wrestling competitions in Santoshnagar
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

ఆవాజ్‌ హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా కమిటీ
ఆద్వర్యంలో సెవెన్‌ బీ మైదానంలో 
మల్లయోధుల ప్రతిభాపాటవాలు
175 జంటల హోరాహోరీ
విజేతలకు పతకాలు, మెడల్స్‌, 
ధ్రువపత్రాల అందజేత
నవతెలంగాణ-చార్మినార్‌
హైదరాబాద్‌‌లోని సంతోష్‌నగర్‌లో సంప్రదాయ కుస్తీ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఆవాజ్‌ హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సెవెన్‌ బీ మైదానంలో జరిగిన ఈ పోటీల్లో పాతబస్తీతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అఖాడాల నుంచి సుమారు 175 జంటల మల్లయోధులు పాల్గొని హోరాహోరీగా తలపడ్డారు. బార్కస్‌, పాతబస్తీ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన మల్లయోధులు దావ్‌పేచ్‌తో ప్రత్యర్థులను ఎదుర్కొంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విజేతలకు ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ అబ్బాస్‌ చేతుల మీదుగా పతకాలు, మెడల్స్‌, ధ్రువపత్రాలు అందజేసి సత్కరించారు. అనంతరం ఆవాజ్‌ హైదరాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మమ్మద్‌ రహీం పైల్వాన్‌ మాట్లాడారు. వివిధ అఖాడాల మల్లయోధులను ఒకే వేదికపైకి తీసుకురావడం, సంప్రదాయ కుస్తీకి ప్రోత్సాహం అందించడం, యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే పోటీల లక్ష్యమన్నారు. ప్రతిభావంతులైన యువ మల్లయోధులకు అవకాశాలు కల్పిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తారని తెలిపారు. పోటీలను వీక్షించేందుకు సంతోష్‌నగర్‌తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. చిన్నారులు, యువత, కుస్తీ అభిమానులు చప్పట్లతో మల్లయోధులను ప్రోత్సహించడంతో సెవెన్‌ బీ మైదానం సందడిగా మారింది. సంప్రదాయ కుస్తీని కాపాడుతూ యువ మల్లయోధులను ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలను భవిష్యత్తులోనూ కొనసాగించాలని క్రీడాభిమానులు ఆకాంక్షించారు. పోటీలు విజయవంతం కావడంతో నిర్వాహకులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ అబ్బాస్‌, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్‌ నాయక్‌, కార్మిక సంఘం నాయకులు శ్రావణ్‌ కుమార్‌, జీవితాన్ని జంగయ్య మీనా, ఆవాజ్‌ జిల్లా అధ్యక్షులు మెహబూబ్‌ అలీ, గులాం నసీర్‌, సయ్యద్‌ ఇఫ్తేఖారుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్