Magazines

యువ ‘వికాసం’

1 గంట క్రితం

Young 'development'
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 2 నిమిషాల చదవడం

ప్రభుత్వ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆశలు
నవంబర్‌లో లబ్దిదారుల ఎంపిక ​
ఏడాది తర్వాత పథకం అమలుకు కదలిక
నవతెలంగాణ-సిటీబ్యూరో

నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఎట్టకేలకు మోక్షం లభించనుంది. ఏడాదిగా పెండిం‌గ్‌లో ఉన్న ఈ పథకాన్ని నవంబర్ నుంచి ప్రారంభించి ల‌బ్దిదారులకు రుణాలు అందజేస్తామని ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. దీంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. నవంబరు 19 నుంచి రూ.లక్షలోపు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మొదటి విడతలో సాయం మంజూరు చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ పథకం కింద రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు సబ్సిడీతో రుణాలను అందించనున్నారు.

​లబ్దిదారులుగా 24,634 మంది

​నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం 'రాజీవ్ యువ వికాసం' పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రూ.50 వేలు మొదలుకుని రూ.4లక్షల వరకు కేటగిరీల వారీగా రుణాలు మంజూరు చేయాలని నిర్ధారిం చింది.

గతేడాది ప్రభుత్వం పథకం ప్రారంభించి ధరఖా స్తులను ఆహ్వానించగా మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లాలో ఊహించని విధంగా భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 66,816 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకు న్నారు. అధికారులు ఈ దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేసి 24,634 మందిని లబ్దిదారులుగా (అర్హులుగా) ఎంపిక చేశారు. వీరికి గతేడాది రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ప్రొసీడింగ్స్ అందజేస్తామని మొదట ప్రభుత్వం ప్రకటించి ఆ తర్వాత వాయిదా వేసింది. ఈ పథకం కింద బ్యాంక్ రుణాల మంజూరుకు నాలుగు కేటగి రీల కింద లబ్దిదారులను ఎంపిక చేశారు.

​నాలుగు కేటగిరీల్లో రుణాలు

రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎంపిక చేసిన మొత్తం నాలుగు కేటగిరీల లబ్దిదారులకు కలిపి రూ.401,236 కోట్లు బ్యాంక్ రుణాలు మంజూరు చేయనున్నారు. ఇందులో 86,238 కోట్లు లబ్దిదారులు తిరిగి బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. రూ.314,998 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ కింద చెల్లించనుంది. నాలుగు కేటగిరీల్లో కేటగిరీ-1 కింద 7,876 మంది, కేటగిరీ-2 కింద 6,158 మంది, కేటగిరి-3 కింద 5,247 మంది, కేటగిరీ-4 కింద 5,353 మందికి ఈ రుణాలను అందజేయనున్నారు. కేటగిరీ-1 కింద ఎంపిక చేసిన వారికి రూ.50 వేలు మంజూరు చేస్తారు. వీరికి 100 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. కేటగిరీ-2 కింద ఎంపిక చేసిన వారికి రూ.లక్ష మంజూరు చేస్తారు. వీరికి 90 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. కేటగిరీ-3 కింద ఎంపిక చేసిన వారికి రూ.2 లక్షల రుణం అందజేస్తారు. వీరికి 80 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. కేటగిరీ-4 కింద రూ.4 లక్షలు మంజూరు చేస్తారు. వీరికి 70 శాతం సబ్సిడీ వర్తిస్తుంది.

​నవంబరు నుంచి
 రూ.లక్ష సాయం
రాజీవ్ యువ వికాసం కింద ఎంపికైన లబ్దిదారు లకు నవంబరు 19వ తేదీ నుంచి రూ.లక్ష సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నిరుద్యోగుల్లో ఆశలు మొలకెత్తాయి. వాయిదా పడుతూ వస్తున్న పథకాన్ని ఈసారి ఎలాగైనా అమలు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. గతంలో స్థానిక ఎన్నికలకు సమయం ఉండటంతో వాయిదా పడిన పథకం ఈసారి ఎన్నికలు లేనందున అమలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

వర్గాల వారీగా 
అర్హుల వివరాలు


​మైనార్టీలు 2,316

క్రైస్తవులు 1.099

బీసీలు 7.799

ఈబీసీలు 5,618

ఎస్టీలు 1.594

ఎస్సీలు 6,208

మొత్తం 24,634


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్