Magazines

వైవిధ్యమైన కాన్సెప్ట్‌

22 గంటల క్రితం

A diverse concept
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

రెండు ప్రముఖ సంస్థలు సం యుక్తంగా ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ జీ స్వ్కాడ్‌ ‘ఆర్‌ఎక్స్‌’ చిత్రాన్ని రూపొందిస్తోంది. రెజీనా కసాండ్రా, నాజర్, రమేష్ తిలక్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దీపావళి సందర్భంగా విడుదల చేశారు. వివిధ భాషల్లో తన నిర్మాణ సంస్థ పరిధిని విస్తరిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ తమిళ చిత్రసీమలోనూ తనదైన ముద్ర వేస్తోంది. అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘మోద రాత్రి’ వంటి చిత్రాలతో తమిళంలోనూ అలరించింది. ఈ సినిమా కోసం లోకేష్ కనగరాజ్‌కు చెందిన జీ స్వ్కాడ్‌తో కలిసి పనిచేయడం ద్వారా విభిన్నమైన కథలను ప్రోత్సహించడంతో పాటు, కొత్త క్రియేటివ్ పార్ట్‌నర్‌షిప్స్‌కు మద్దతు ఇవ్వాలనే మైత్రీ మూవీ మేకర్స్ నిబద్ధత మరోసారి స్పష్టమవుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రెజీనా కసాండ్రా ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ‘ట్రూత్ ఆల్వేస్ డిమాండ్స్ ఎ వాయిస్!’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ మిస్టరీ, ఉత్కంఠను పెంచుతోంది. ‘సిల నేరంగళిల్ సిల మనిధర్గల్’, ‘బాంబ్’ వంటి చిత్రాలతో తనదైన కథన శైలికి గుర్తింపు తెచ్చుకున్న విశాల్ వెంకట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రదీప్ భూపతి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్