Magazines

సర్‌ప్రైజ్‌ చేసే లవ్‌స్టోరీ

22 గంటల క్రితం

surprises
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

నిర్మాతలు పుష్కూర్ రామ్ మోహన్ రావు, భరత్ ఎన్. నారంగ్ నేతృత్వంలోని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థ ‘బబ్లూ ఎక్స్‌ఎక్స్‌ఎల్‌’ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జెన్ జెడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే ఎంటర్‌టైనర్‌గా సోనాలి నారంగ్ సమర్పణలో తెరకెక్కిస్తున్నారు. దీపావళి వేడుకలకు మరింత ప్రత్యేకతను జోడిస్తూ మేకర్స్ తాజాగా ఫస్ట్ స్పార్క్‌ను విడుదల చేశారు. బబ్లూ ప్రేమకథ ఎలా మొదలవుతుందో వినోదాత్మకంగా పరిచయం చేస్తూ ఈ గ్లింప్స్‌ను రూపొందించారు. తొలిచూపులోనే ప్రేమ పుట్టే క్షణంలోని మ్యాజిక్‌ను, ఆ సమయంలో కలిగే ఉత్సాహం, ఆసక్తి, అందమైన భావోద్వేగాలను ఈ ఫస్ట్ స్పార్క్ ఎంతో అందంగా ప్రజెంట్ చేస్తోంది. సుమంత్ ప్రభాస్ ఈ చిత్రంలో యూత్‌ఫుల్, ఎంటర్‌టైనింగ్ పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్ స్పార్క్‌లో ఆయన సాయిపల్లవి వీరాభిమానిగా పరిచయమయ్యారు. తన సహజమైన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాత్రకు మరింత ఆసక్తిని జోడించారు. మంచిర్యాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, జయలలిత, శివాజీ రాజా ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్