Magazines

ఆ ట్విస్ట్ చెబితే రూ. కోటి బహుమతి

1 గంట క్రితం

twist
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటించిన సై ఫై థ్రిల్లర్ ‘కిల్లర్’. ధ్యానం నాన్నఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మించారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులు. పూర్వాజ్ దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ రాబోతోంది. ఓవర్సీస్ లో ఈ మూవీని ఓఎంజి పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. బుధవారం ఈ సినిమాకి సంబంధించి కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్ మీట్ ను మేకర్స్‌ నిర్వహించారు. లైన్ ప్రొడ్యూసర్ సీతారామ్ మాట్లాడుతూ,‘ నా పాత్ర ఈ కథలో ఎంత కీలకంగా ఉంటుంది అనేది తెరపై చూడాలి’ అని తెలిపారు. ‘డైరెక్టర్ పూర్వజ్ సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో సరికొత్త క్యారెక్టర్స్ తో ఈ సినిమాను రూపొందించారు’ అని నటుడు, లైన్ ప్రొడ్యూసర్ అయినాబత్తిన దశరధ చెప్పారు.

హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ, ‘కిల్లర్ లాంటి బ్రిలియంట్ సబ్జెక్ట్ ను తెరపైకి తీసుకొస్తున్న పూర్వజ్ కు కంగ్రాట్స్ చెబుతున్నా’ అని తెలిపారు. హైకోర్ట్ లాయర్ సురేష్ మాట్లాడుతూ,‘దర్శకుడు పూర్వాజ్‌ తన సినిమా మీద నమ్మకంతో కోటి రూపాయల ఆఫర్ ప్రేక్షకులకు ఇస్తున్నారు’ అని అన్నారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్ మాట్లా డుతూ,‘సినిమా సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ ఏదైతో ఉందో, ఆ ట్విస్ట్ అలా అవడానికి ఒక మేజర్ రీజన్ ఉంటుంది. ఇంటర్వెల్ ఇచ్చిన 5 నిమిషాల్లో జస్ట్ వన్ లైన్ ఆన్సర్ మా వాట్సాప్ నెంబర్ కు పంపాలి. షో చూస్తున్న టికెట్ ఫొటో పెట్టి ఆన్సర్ రాయాలి. వాటిల్లో ఎవరైతే ముందుగా, కరెక్ట్ ఆన్సర్‌ పంపుతారో వారికి అక్ష‍రాల కోటి రూపాయలను బహుమతిగా అందజేస్తాం’ అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్