Magazines

ఆ.. రెండు విజయాలు డబుల్‌ ఎనర్జీ ఇచ్చాయి

7 గంటల క్రితం

victories
avatar
balaji

ప్రచురించబడింది నవం 13, 2026 | 2 నిమిషాల చదవడం

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రామాయణం’ సినిమాకి దేశవ్యాప్తంగా అద్భుత మైన స్పందన లభిస్తోంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి కొత్త బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేసింది. మరోవైపు హీరో సూర్య, జీతూ మాధవన్ కలయికలో వచ్చిన యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘సీన్’ కూడా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. జ్యోతిక, సూర్య తమ అగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌ టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రామాయణం’, ‘సీన్’ చిత్రాలను తెలుగు రాష్ట్రాల్లో ఎస్వీసీ ద్వారా నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.

ఈ రెండు సినిమాల విజయాల సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో దిల్‌ రాజు మాట్లాడారు. ‘రామాయణం’ ప్రపంచ వ్యాప్తం గా వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించి ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇంత అద్భుతమైన విజయం అందు కోవడం, ఆ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మా నిర్మాత నమిత్ మల్హోత్రాకి, యష్కి థాంక్స్. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సహా అందరూ అద్భుతంగా నటించారు. ‘రామాయణం’ అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి నప్పుడే అందులో ఉన్న ఇతివృత్తం మన తరతరాలకు అర్థమవుతుంది. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు నేను, శిరీష్ కలిసి బొంబాయిలో ఈ సినిమా చూశాం. అప్పుడు సినిమా చూసినప్పుడు కలిగిన అనుభూతి మామూలుగా లేదు. ఆ సమయంలో నాకు కలిగిన అనుభూతిని సెల్ఫి తీసుకొని మీతో పంచుకున్నాను. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినిమా చూస్తున్న ప్రేక్షకులకు కూడా అదే అనుభూతి కలుగుతోంది.

దాంతోపాటు ఆరో తేదీన విడుదలైన ‘సీన్’ సినిమా విజయం కూడా మరింత ఆనందాన్ని ఇచ్చింది. తిరుపతి ప్రసాద్ తెలుగు రాష్ట్రాల రైట్స్ తీసుకుని, మా ద్వారా నైజాంలో రిలీజ్ చేయించినందుకు ఆయనకు ధన్యవాదాలు. సూర్య కెరీర్‌లోనే ఈ సినిమా హయ్యెస్ట్ రెవెన్యూ క్రియేట్ చేయ బోతోంది. ఈ సినిమాతో ఆయన హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ అందు కున్నారు. ఒక మంచి కథ రాసుకుని, ఎంత కాంపాక్ట్‌గా సినిమా తీసి హిట్ కొట్టవచ్చో ‘సీన్’ సినిమా ద్వారా నేర్చుకున్నాం. నేను ఇండస్ట్రీకి 30 ఏళ్లు అవు తోంది. విజయాలు చూశాం, అపజ యాలు చూశాం. నేను ఎప్పుడూ ఫెయిల్యూర్స్‌కు కుంగిపోను, సక్సెస్‌కు పొంగిపోను. ఎప్పుడూ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాను. ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు మంచి చేస్తూ, మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను. ‘రామాయణం’, ‘సీన్‌’.. ఈ రెండు సినిమాల విజయాలు మాకు గొప్ప ఆనందాన్ని అందకంటే డబుల్‌ ఎనర్జీని మాకు ఇచ్చాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్