హీరో నాని తన యునానిమస్ ప్రొడక్షన్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. 'అలియాస్ రుక్మిణి' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా, 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మాణంలో రొమాన్స్, హ్యూమర్, ఆసక్తికరమైన కథనంతో ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా హీరో నితిన్‌తో పాటు చిత్ర బృందం సెలబ్రేట్ చేసుకుంది. సెట్స్‌లో చిత్ర యూనిట్ అంతా కలిసి ఆనందంగా గడిపిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం ఆకట్టుకుంటున్నాయి. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మరోవైపు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ‘రుక్కు రుక్కు రుక్మిణి’తో ప్రారంభించాం. విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా డిసెంబర్ 4న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఆఫియా సయ్యద్, సాయికుమార్, హర్షవర్ధన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సినిమాటో గ్రఫీ: జోమోన్ టీ. జాన్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, ఎడిటర్: సృజన అడుసుమిల్లి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ.







కామెంట్‌లు (0)