Magazines

‘భోగి’ రిలీజ్‌కి రెడీ

3 గంటల క్రితం

Bhogi
avatar
balaji

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

శర్వా పూర్తిగా రస్టిక్ అవతార్‌లో కనిపించనున్న ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్ల లోకి రానుంది. ఈ సినిమాలో శర్వా గంగా పాత్రలో పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తుండగా, సినిమాలో మరికొందరు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1960ల ప్రారంభంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఓ గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్