Magazines

ఆద్యంతం వినోదభరితం

1 గంట క్రితం

Entertaining
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న తాజా చిత్రం ‘దొంగ నా కొడుకు’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ ఫస్ట్ సింగిల్ ‘ఓ మై గాడ్’ను విడుదల చేశారు. హీరో మౌళి మాట్లాడుతూ,‘సందీప్ మాస్టర్ నన్ను కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చి ఈ సాంగ్ చేయించారు. భాస్కర భట్ల అందరికీ అర్థమయ్యేలా, యూత్‌కు కనెక్ట్ అయ్యేలా అద్భుతంగా లిరిక్స్ రాశారు. అలాగే రామ్ మిరియాల నా సినిమాకు పాట పాడడం అదృష్టంగా భావిస్తున్నాను.


సింజిత్ తన మ్యూజిక్‌తో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తాడు. ఈ సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా ఇది’ అని తెలిపారు. ‘టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. మా మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ చాలా మంచి పాటలు ఇచ్చారు’ అని డైరెక్టర్ శ్రీను కంబాల చెప్పారు. హీరోయిన్ సుష్మిత శెట్టి మాట్లాడుతూ, ‘నేను తెలుగు అమ్మాయిని. డైరెక్టర్ సినిమాను చాలా అద్భుతంగా తీశారు. మౌళితో కలిసి నటించడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. ఇది అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది’ అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్