Magazines

‘మైసా’ కోసం ..

3 గంటల క్రితం

Maisa
avatar
balaji

ప్రచురించబడింది నవం 20, 2026 | 2 నిమిషాల చదవడం

కథానాయిక రష్మిక మందన్న నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మైసా’. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, టీజర్, రెండు పాటలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగించాయి. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా నుంచి మూడో సింగిల్‌గా ‘ఒసేయ్ రాములమ్మ’ పాటను రిలీజ్ చేశారు. తెలుగు సినిమా చరిత్రలో విప్లవ స్ఫూర్తిని రగిలించిన ఐకానిక్ పాటల్లో ‘ఒసేయ్ రాములమ్మ’ ఒకటి. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ,‘ఈ పాట రీక్రియేట్ అనగానే మనసులో కొంచెం భయం మొదలైంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఐకానిక్ సాంగ్. దాన్ని రీక్రియేట్ చేయడం చాలా పెద్ద బాధ్యత. మేము ఒరిజినల్‌ను మ్యాచ్ చేయలేము. కానీ ఆ పాటకు న్యాయం చేసేలా మా ప్రయత్నం చేశాం. వందేమాతరం శ్రీనివాస్ పాట పాడటం చాలా ఆనందంగా ఉంది. అలాగే సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన సాహిత్యం రాశారు. విజయశాంతి మేడమ్‌కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు.


ఈ పాట ఆమెకు ఒక చిన్న ట్రిబ్యూట్. ‘ఒసేయ్ రాము లమ్మ’ కథ చాలా ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్. ఆ సినిమా ఒక చరిత్ర క్రియేట్ చేసింది. ఇప్పుడు మైసాలో ఈ పాట రీక్రియేషన్‌కు కూడా మీరు అలాంటి ప్రేమనే అందిస్తారని కోరుకుంటున్నాను. ఈనెల 27న థియేటర్లలో కలుద్దాం’ అని తెలిపారు. ‘రష్మిక లాంటి అందమైన, అమాయకమైన అమ్మా యితో ఇంత పవర్‌ఫుల్ కథను దర్శకుడు ఎలా ఊహిం చారో నాకు చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ఈ సినిమాలో పాట చూస్తుంటే రష్మిక చాలా ఫియర్స్‌గా కనిపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ పాట థియేటర్స్ లో గుజ్బంప్స్ తెప్పిస్తుంది’ అని వందేమాతరం శ్రీనివాస్ చెప్పారు. సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ,‘ఇందులో నేను రెండు పాటలు రాశాను. మొదటి పాటకు అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది.


డైరెక్టర్ ‘ఒసేయ్ రాములమ్మ’ పాటను మళ్లీ ఇందులో ఆవిష్కరించబోతున్నామని చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. ఈ సినిమాలో రష్మిక అద్భుతంగా ఉన్నారు. ఆవిడ పేరు మీద ఒక పాట రాయాలనిపిస్తోంది. రాములమ్మ పాట రాయడం చాలా అద్భుతమైన అనుభూతి. చాలా గొప్ప సందర్భంలో ఈ పాట వస్తుంది. మన తెలంగాణ కోడలు రష్మికకు ఈ పాట రాసే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు గర్జన మాత్రమే వినిపించింది. రేపు సింహం కనిపించబోతోంది’ అని అన్నారు. ‘29 సంవత్సరాల తర్వాత వందేమాతరం శ్రీనివాస్, సుద్దాల అశోక్ తేజ కాంబినేషన్‌లో ఈ పాట రావడం చాలా విశేషం. మా మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ ఈ పాటను అద్భుతంగా రూపొందించారు. థియేటర్లలో మీ అందరినీ ఈ పాట అలరిస్తుంది’ అని డైరెక్టర్ రవీంద్ర పుల్లె చెప్పారు. అజయ్ మాట్లాడుతూ, ‘ఆదిత్య మ్యూజిక్ నుంచి ఈ సాంగ్‌ను అందించిన ఆదిత్య మ్యూజిక్‌కి, దిల్ రాజుకి ధన్యవాదాలు’ అని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్