యువ కథానాయకుడు శివ కందు కూరి త్వరలోనే తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతు న్నారు. నిర్మాత రాజ్ కందు కూరి తనయుడైన శివ కందుకూరి, హైదరాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్ శిశిర సింహాను డిసెంబర్‌లో వివా హం చేసుకోబోతున్నారు. ‘చూసీ చూడంగానే’, ‘గమనం’, ‘మను చరిత్ర’, ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ వంటి సినిమాల్లో తన నటనతో శివ కందుకూరి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి వేడుక ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఆత్మీయుల సమక్షంలో అత్యంత ఘనంగా జరగనుంది.
డిసెంబర్‌లో హీరో శివ కందుకూరి వివాహం
4 గంటల క్రితం

balaji
ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)