దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పనిచేసి, పలు బ్లాక్‌బస్టర్ సినిమాలకు కో-రైటర్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఎస్ కృష్ణ ‘హై’ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాకు ఆయనే కథ, స్క్రీన్‌ప్లే బాధ్యతలు చేపట్టడంతో పాటు కీలక పాత్రలోనూ నటిస్తున్నారు. హరీష్ పెద్ది, శేఖర్ దివ్వెలతో కలిసి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్టైన్మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమా ఎమోషన్స్, డ్రామా, హై ఎనర్జీ మూమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించనుంది. అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
ఈ సినిమా ప్రతి వ్యక్తి తన జీవితంలో కోరుకునే ఆనందం, ఉత్సాహం వెనుక ఉన్న భావోద్వేగ, మానసిక, నైతిక సంఘర్ష ణలను ఆవిష్కరించనుంది. ఒక పాత్ర ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటే, మరో పాత్ర డబ్బు, మద్యం ద్వారా ఆనందాన్ని వెతుక్కుంటుంది. మరో యువతి తన ఆత్మగౌరవాన్ని తిరిగి సాధించుకోవడం ద్వారా తనలోని బలాన్ని గుర్తిస్తుంది. అదే సమయంలో ఆమె ప్రేమికుడు బెట్టింగ్స్‌లో థ్రిల్‌ను వెతుక్కుంటాడు.
ఇలా పరస్పరం అనుసంధానమైన కథల ద్వారా, డేంజర్ మార్గాలను ఎంచుకోవడం కంటే సరైన నిర్ణయాలు తీసుకోవడంలోనే జీవితానికి నిజమైన ఆనందం లభిస్తుందనే విషయాన్ని ఈ సినిమా ప్రజెంట్ చేయబోతోంది. అన్ని వర్గాలకు కనెక్ట్ అయ్యేలా కథ ఉంటుంది అని మేకర్స్ తెలిపారు.






కామెంట్లు (0)