అగ్రకథానాయకుడు చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘కాకా’. వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
వర్షంతో తడిసిన వాతావరణంలో, పచ్చని పొలాల మధ్య చేతిలో కొడవలి పట్టుకుని ఇంటెన్స్ గా నిలబడిన చిరంజీవి లుక్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ సినిమా రా అండ్ ఇంటెన్స్ ప్రజెంట్ చేస్తోంది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో వచ్చే సంక్రాంతి బరిలో ‘కాకా’ మేజర్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా థామస్‌తో పాటు బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.







కామెంట్‌లు (0)