Magazines

గ్యాంబ్లింగ్‌ చుట్టూ తిరిగే ‘పాకెట్‌ రాకెట్స్‌’

1 గంట క్రితం

Pocket Rockets
avatar
balaji

ప్రచురించబడింది నవం 03, 2026 | 2 నిమిషాల చదవడం

నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాత‌లు. డిసెంబర్ 11న సినిమా విడుదలకానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా… శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్‌గా .. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో న‌టిస్తున్నారు. గ్యాబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమా నుంచి మంగ‌ళ‌వారం ది ఫ‌స్ట్ హ్యాండ్ అంటూ టీజ‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. నిహారిక కొణిదెల మాట్లాడుతూ,‘టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. అంజి, ఏసు, జేడీ పాత్రలు అద్భుతంగా ఉంటాయి. ఆరు నెలల్లో సినిమాని పూర్తి చేసి, రిలీజ్ చేస్తున్నాం.

డిసెంబర్ 11న మా చిత్రం రాబోతోంది. ఇక రిలీజ్ వరకు మేమంతా మీ సోషల్ మీడియాలోకి, మీ ఇంట్లోకి వచ్చేస్తాం’ అని అన్నారు. ‘ఈ సినిమా కోసం నేను అక్టోబర్‌లో షూట్ చేశాను. నవంబర్‌లో టీజర్ అన్నారు, డిసెంబర్‌లో రిలీజ్ చేస్తున్నారు. నా లైఫ్‌లో నిహారిక లాంటి గ్రేట్ ప్రొడ్యూ సర్‌ని చూడలేదు. ఈ సినిమా స్కేల్‌ని మన్యం రమేష్ పెంచారు. రుద్ర ఏం తీశారు, ఎంత గొప్పగా చేశారు అన్నది థియేటర్లోనే చూసి తెలుసుకోండి’ అని జేడీ చక్రవర్తి చెప్పారు. నిర్మాత రాహుల్ రాఘవేంద్ర మాట్లాడుతూ,‘మేం డిజిటల్ కంటెంట్ చేసేవాళ్లం. మాకు ఇదే తొలి చిత్రం. నిహారికతో మేం కలిసి ఈ సినిమాని నిర్మించాం. రుద్ర చెప్పిన స్క్రిప్ట్ మాకెంతో నచ్చింది. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. పాకెట్‌లో ఉన్న ఫోన్ తీయకుండా రెండు గంటల సేపు అలరించేలా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు. ‘టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను.

నాకు ఇంతలా సపోర్ట్ చేసిన నిహారికకి థాంక్స్. నా టీం ఇచ్చిన సపోర్ట్ వల్లే సినిమాని ఇంత వేగంగా పూర్తి చేయగలిగాను’ అని దర్శకుడు రుద్ర అత్రి చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ గ్యానీ మాట్లాడుతూ,‘సినిమా బాగా వచ్చింది. అందరూ ప్రాణం పెట్టి పని చేశారు’ అని తెలిపారు. ‘నేను అంజి అనే పాత్రలో కనిపిస్తాను. జీవితాన్ని మార్చుకోవాలని, అవకాశం రావాలని తపన పడే కుర్రాడి పాత్ర’ అని త్రినాథ వర్మ చెప్పారు. ‘ఇది నాకు తొలి చిత్రం. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిహారిక, రుద్రకి థాంక్స్’ అని నిర్మల్ తెలిపారు. శ్రియా కొంతం మాట్లాడుతూ,‘హారిక అనే పాత్రను పోషించాను. నా క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ క్యారెక్టర్‌ చేయటం హ్యాపీగా ఉంది’ అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్