Magazines

పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

5 గంటల క్రితం

family entertainer
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

శివాజీ ప్రధాన పాత్రలో ఎస్‌టీబీఎల్‌ సినిమాస్ నిర్మాణ సంస్థ తొలి చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పూర్తయింది. రవికృష్ణ, కసిరెడ్డి, భరణ్, ఖుష్బూ, రాధ్య, మౌనిక కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్‌ ‘M3’. 72 రోజుల పాటు సాగిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ విజయవంతంగా పూర్తి చేసింది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో శివాజీ సంప్రదాయ దుస్తుల్లో హుందాగా కనిపించారు. శివాజీ పాత్ర ఎలా ఉండబోతోందన్న ఆసక్తిని ఈ లుక్ మరింత పెంచుతోంది. బాలాజీ వి.ఆర్‌. దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మంచి యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కలిసి చూసి ఆనందించేలా, మంచి సందేశంతో పాటు ఆద్యంతం నవ్వులు పూయించే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీన్ని డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: రాంకీ, సంగీతం: ప్రవీణ్ కె. పోతునూరి, డీవోపీ: వెంకట్, మాటలు: అశోక్ వడ్లమూడి, భాను మొగలిపువ్వు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్